| S.No | Course Name | Course Outcome | |
| 1 | Special Telugu | 1 Sem ప్రాచీన కవితా పరిచయం 1.మార్గకవితకు వ్యతిరేకంగా తలెత్తిన దేశికవిత్వోద్యమాన్ని అవగాహన చేసుకుంటారు. శివకవుల కాలంనాటి మత, ధార్మిక పరిస్థితులను, భాషావిశేషాలను గ్రహిస్తారు. 2.నన్నయ మహాభారత రచనా విశిష్టతను గ్రహిస్తూ, అందులోని కావ్యశిల్పం ద్వారా రసానుభూతిని పొందగలరు ఉపాఖ్యానాలలోని సందేశాన్ని గ్రహించగలరు. 3.శ్రీనాథుని రచనా శిల్పాన్ని అర్ధం చేసుకోగలరు. 4.కావ్యం ప్రబంధ ప్రక్రియలోకి పరిణమించిన వైనాన్నితెలుసుకుంటారు. ప్రబంధయుగ విశిష్టతను, అల్లసాని కవితలోని జిగిబిగిని ఆస్వాదించగలరు.కావ్యవస్తువులో కాలానుగుణంగా వచ్చిన మార్పులు గ్రహించగలరు. 1 Sem ఆధునిక కవితా పరిచయం
2. సున్నితమైన భాషను ఉపయోగిస్తూ, ఉత్తమభావాలను ప్రకటించే సామర్థ్యాన్ని అందుకుంటారు. సమాజంలోని అసమానతలను కవిత్వం ద్వారా ఖండించడం, విభిన్న కవితా వస్తువులతో కవిత్వాన్ని రాయడం నేర్చు కుంటారు. 3. వ్యవహరికభాషలో సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహించే కవిత్వం రాయడానికి ప్రేరణ పొందుతారు. ఆధునికకాలంలో కవితల్లోను, వస్తువులోను, భావంలోను వచ్చిన మార్పులను గ్రహించడం వల్ల కవిత్వ రచనా విధానం తెలుస్తుంది. 4. దీర్ఘ కావ్య ప్రక్రియను, రచనా విధానాన్ని అర్థం చేసుకుంటారు. శిల్పంలో స్వేచ్ఛను, భావప్రకటనలో వచ్చిన మార్పులను, సమాజానికి కావ్యభాష దగ్గర కావడాన్ని అవగాహన చేసుకుంటారు. 5. కవిత్వ రచనా విధానంలో అలంకారం, ప్రతీక, భావ చిత్రం ఉపయోగాన్ని తెలుసుకుంటారు. కవిత్వంలో ఉన్న వివిధ రకాల వాదాలను, భావ వ్యక్తీకరణను గ్రహిస్తారు. 2 Sem ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర
2. వివిధ సాహిత్య ప్రక్రియల వికాసాన్ని అవగాహన చేసుకోవడమే కాకుండా నన్నయ మహాభారత రచనా విధానం, నన్నయ కవితారీతులు, నన్నయ భారతాంధ్రీకరణ విధానాన్ని అర్థం చేసుకుంటారు. 4. ప్రబంధ ప్రక్రియా లక్షణాలను, కావ్య రచనలో అష్టాదశ వర్ణనల ప్రాముఖ్యతను, పద్య నిర్మాణం పట్ల అభిరుచిని సొంతం చేసుకుంటారు. 5. దక్షిణాంధ్రయుగ వైశిష్ట్యం, రఘునాథనాయకుని సాహిత్య పోషణతో పాటు ఆ యుగ సాహిత్యాన్ని పరిచయం చేయడం ద్వారా కావ్యాల పట్ల అభిరుచి పెరుగుతుంది. 2 Sem ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర
2. భావకవితా శాఖలను అధ్యయనం చేయడం ద్వారా సామాజిక మార్పులు సాహిత్యంలో ఎలా ప్రతిబింబించాయో గ్రహిస్తారు. 3. ఆధునిక సాహితీ ప్రక్రియలను అవగాహన చేసుకోవడం ద్వారా సమాజంపై సాహిత్య ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు. మార్క్సిజం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భావవిప్లవాన్ని అర్థం చేసుకుంటారు. 4. భిన్న కవితా శాఖలను, ఒకే కాలంలో వచ్చిన భిన్న సాహిత్య వస్తు వైవిధ్యాన్ని అర్ధం చేసుకుంటారు. 5. సమకాలీన ఆధునిక కవితాధోరణులను అవగాహన చేసుకోవడం వల్ల అస్తిత్వవాదాల పట్ల తమదైన వైఖరిని ఏర్పరచుకుంటారు 3 Sem ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర
2. వివిధ సాహిత్య ప్రక్రియల వికాసాన్ని అవగాహన చేసుకోవడమే కాకుండా నన్నయ మహాభారత రచనా విధానం, నన్నయ కవితారీతులు, నన్నయ భారతాంధ్రీకరణ విధానాన్ని అర్థం చేసుకుంటారు. 4. ప్రబంధ ప్రక్రియా లక్షణాలను, కావ్య రచనలో అష్టాదశ వర్ణనల ప్రాముఖ్యతను, పద్య నిర్మాణం పట్ల అభిరుచిని సొంతం చేసుకుంటారు. 5. దక్షిణాంధ్రయుగ వైశిష్ట్యం, రఘునాథనాయకుని సాహిత్య పోషణతో పాటు ఆ యుగ సాహిత్యాన్ని పరిచయం చేయడం ద్వారా కావ్యాల పట్ల అభిరుచి పెరుగుతుంది. 3 Sem ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర
2. భావకవితా శాఖలను అధ్యయనం చేయడం ద్వారా సామాజిక మార్పులు సాహిత్యంలో ఎలా ప్రతిబింబించాయో గ్రహిస్తారు. 3. ఆధునిక సాహితీ ప్రక్రియలను అవగాహన చేసుకోవడం ద్వారా సమాజంపై సాహిత్య ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు. మార్క్సిజం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భావవిప్లవాన్ని అర్థం చేసుకుంటారు. 4. భిన్న కవితా శాఖలను, ఒకే కాలంలో వచ్చిన భిన్న సాహిత్య వస్తు వైవిధ్యాన్ని అర్ధం చేసుకుంటారు. 5. సమకాలీన ఆధునిక కవితాధోరణులను అవగాహన చేసుకోవడం వల్ల అస్తిత్వవాదాల పట్ల తమదైన వైఖరిని ఏర్పరచుకుంటారు 3 Sem ప్రాచీన కావ్యం 2. రామరాజభూషణుని కల్పనా చాతుర్యాన్ని తెలుసుకోవడం ద్వారా కల్పనా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. 3. శ్లేష, చమత్కారాలను అవగాహన చేసుకోవడంవల్ల విద్యార్ధుల సంభాషణా నైపుణ్యం, వర్ణనా నైపుణ్యం పెంపొందించుకోగలరు. 4.ప్రబంధ ప్రక్రియలోని పద్యాలను చదవడం ద్వారా వర్ణనా నైపుణ్యం పెంపొందుతుంది. 5. పద ప్రయోగాల అవగాహన ద్వారా విద్యార్థులు తెలుగు బాషా నైపుణ్యాలను అభివృద్ధిచేసుకుంటారు. 3 Sem ఆధునిక కావ్యం 2. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్య ప్రత్యేకతను తెలుసుకుంటారు. 3. ఈ కవితా ఖండికల ద్వారా అభ్యుదయ కవిత్వ తాత్విక భూమికను, మార్క్సిజమ్ ప్రభావాన్ని అర్ధం చేసుకుంటారు. 4. మహాప్రస్థానంలోని సామాజిక తాత్విక దృష్టిని గమనించగలరు. 5. అభ్యుదయ కవిత్వ అభ్యాసం వల్ల కవితా నిర్మాణ శక్తి పెంపొందుతుంది. 4th Sem ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శ 2. సాహిత్య విమర్శలో అలంకార శాస్త్ర ప్రాముఖ్యతను గుర్తిస్తారు 3. అలంకార శాస్త్ర సిద్ధాంతాల పరిచయం కావ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి తోడ్పడుతుంది. 4. తెలుగు సాహిత్య విమర్శ పుట్టుక, వికాసాల అభ్యసనం సాహిత్యాన్ని సరిగ్గా గ్రహించేలా చేయడంతో పాటు సాహిత్యాన్ని విద్యార్ధులకు సన్నిహితం చేస్తుంది. 5. ప్రాచీన విమర్శనాంశాల అధ్యయనం నేటి సాహిత్య విమర్శకు తద్వారా విమర్శకు దిశా నిర్దేశం చేయగలదు. 4th Sem తెలుగు నాటకం 2. వీరగాథల పరిచయం ద్వారా స్థానిక వీరుల త్యాగాలను గుర్తిస్తారు. 3. ఈ పాఠ్యాంశం ద్వారా సత్య వైశిష్ట్యాన్ని కూడా గమనించగలరు. 4. చరిత్రను నాటకంగా ఎలా మలచాలో తెలుసుకుంటారు. 5. సమాజంలోని సమస్యలను అవగాహన చేసుకుంటారు. సమాజ లోపాల పూరణకు నాటకం దోహదపడే విధానాన్ని తెలుసుకుంటారు 4th Sem తెలుగులో బాల సాహిత్యం 2. తెలుగులో ప్రసిద్ధ బాలగేయాలను తెలుసుకొని నేర్చుకోగలరు. 3. బాల కథా సాహిత్యాన్ని అవగాహన చేసుకోగలరు. 5. శతక లక్షణాలను నేర్చుకోవడం ద్వారా శతక రచనా నైపుణ్యాన్ని పొందగలరు. |
|
| 2 | General Telugu | 1 Sem సాహితీ వసంతం 1.తెలుగు సాహిత్యం యొక్క ప్రాచీనతను, విశిష్టతను గుర్తిస్తారు. తిక్కన కాలంనాటి భాషాసంస్కృతులను, ఇతిహాసకాలం నాటి రాచరిక విషయాలపట్ల పరిజ్ఞానాన్ని సంపాదించగలరు. 2. శతకసాహిత్యంలో కనిపించే నైతిక విలువలనూ, సార్వకాలిక సామాజిక, మానవీయ విలువలనూ గ్రహిస్తారు. 3. జాషువ రచనారీతినీ, ఆధునికసాహిత్యంలో పద్యరచనాశిల్పాన్ని, సమాజంలో పేద-ధనిక వ్యత్యాసాల విషయంలో కవి సునిశిత పరిశీలనా నైపుణ్యాన్ని గమనించగలరు. 4. వచన కవిత్వంలో ఆధునిక కవుల అభివ్యక్తి వైవిధ్యాన్ని, ఆలోచింపజేసే సమకాలీన జీవన ఇతివృత్తాలనూ తెలుసుకుంటారు. 5.నిరుపేదల జీవన పోరాటాలను, వ్యవస్థలలో వివిధ పదవులలో ఉన్నవారికి ఉండవలసిన సామాజిక బాధ్యత, సేవాదృక్పథం, మానవీయ విలువల అవసరాన్ని గ్రహిస్తారు. 6. ప్రాచీన కావ్యభాషలోని వ్యాకరణాంశాలను అధ్యయనం చేయడం ద్వారా భాషాసామర్థ్యాలను పెంపొందించుకుంటారు. 2 Sem సాహితీ కుసుమాలు 1.భక్తితత్త్వాన్ని తెలుసుకుంటారు. పోతన రచనాశైలిని, తెలుగుభాషాభివ్యక్తి సౌందర్యాన్నీ అవగతం చేసుకుంటారు. 2. తెలుగు కావ్యప్రక్రియా సౌందర్యాన్నీ, కంకంటి పాపరాజు కవితావైశిష్ట్యాన్నీ, రామాయణకావ్యంలోని కరుణరసాత్మక సన్నివేశ చిత్రణను అర్థం చేసుకుంటారు. 4. విద్యావ్యస్థలో ఎదురయ్యే సవాళ్ళను, మార్పులను, విద్యార్థుల వ్యక్తిగత వైవిధ్యాలనూ తెలుసుకుంటారు. 5. తెలుగువారి తరతరాల జానపద కళారూపాల ప్రాధాన్యాన్ని తెలుసుకుంటారు. 6. తెలుగులో ప్రసిద్ధమైన ఛందస్సు, అలంకారాల విశేషాలు తెలుసుకుంటారు |
|
| 3 | praacheena Telugu sahithyacharithra | తెలుగు చరిత్ర, సాహిత్యం లో అంతర్భాగం అయిన మన సంస్కృతి
తెలుగు సాహిత్య క్రమపరిణామ వికాసం, సంప్రదాయబద్ధమైన మౌకిక,లిఖిత సాహిత్యం. వివిధ సాహిత్య ప్రక్రియల పరిచయం వికాసం, కవులు, రచయితల సృజనాత్మక రచనా విశిష్టత |
|
| 4 | pracheena Kavitha parichayam | ప్రాచీన తెలుగు కవితా సౌందర్య విశిష్టత ‘హర విలాసం’ గొప్ప తనం.
కొంఢ,నదులను తీసుకుని మానవుల స్వభావం చొప్పించి చెప్పడం దాని విశిష్టత.
సంస్కృత కావ్యాన్ని, దానిలోని కవితా సౌందర్యం తెలుసుకుంటారు.
|
|
| 5 | Adhunika kavithaa parichayam |
|
|
| 6 | Adhunika kavithaa parichayam | శతక సాహిత్య లక్షణాలు, ఈ ఫ్రక్రియ ప్రత్యేకత తెలుసుకుంటారు.
శివొజి దేశభక్తి,సమానత్వం, మానవతావిలువలు తెలుసుకునీ పెంపొందించుకుంటారు.
కోయిల గాన ప్రత్యేకత
గోసంగి పాత్ర,విష్ణుభక్తి తత్పరత తెలుసుకుంటారు. |
|
| 7 | I SEM sahithi saurabhum | Course out comes 1. తెలుగు సాహిత్యం యొక్క ప్రాచీనతను, విశిష్టతను గుర్తించడం ఆదికవి నన్నయ కాలంనాటి భాషా, సంస్కృతులను పరిచయం చేయడం
2. జాషువా కాలంనాటి మతపరిస్థితులు, గబ్బిలం కావ్య విశేషాలు తెలియజేయడం ద్వారా సమాజం పట్ల అవగాహనపెంపొందింపజేయడం
3. సంపన్న కుటుంబాలలోని పరిస్థితులు, ప్రేమ, పరువు వంటివి మనిషిని ఎలా నడిపిస్తాయో అవగాహన కల్పించడం
4. జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకున్నాయో అర్థంచేసుకోవడంతో పాటు మన పల్లెటూళ్లు, మానవ సంబంధాలు, ఆస్తి అంతస్తులు వికృత రూపంలో ఎలా సాక్షాత్కరిస్తాయో తెలియజేయడం.
5. జీవిత చరిత్ర ప్రక్రియను, దాని విశిష్టతను పరిచయం చేయడం
6. ప్రాచీన కావ్యభాషలోని వ్యాకరణాంశాలను అధ్యయనం చేయడంవ్యాకరణాంశాల ద్వారా భాషాసామర్ధ్యాన్ని పెంపొందింపజేయడం Programme out comes 1. తెలుగు సాహిత్య అభ్యసన నైపుణ్యాలను, సృజనాత్మక నైపుణ్యాలుగా మార్చడం విద్యార్థులు భాషాతత్వాన్ని, భాష యొక్క ఆవశ్యకతను, భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తింపజేయడం మనిషి వ్యక్తిగత జీవనానికి, సామాజిక వ్యవస్థ పటిష్టతకు భాష ప్రధానమని తెలుసుకునేలా జేయడం తెలుగుభాషలోని కీలకాంశాలైన వర్ణం, పదం, వాక్యాల ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవడం
2. అనువాద రంగంలో నైపుణ్య సంపాదనను కలగజేయడం
3. సృజన రంగం, ప్రసార మాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా జేయడం
4. వ్యాస రచన ఎలా చేయాలో నేర్పించడం
5. సాంకేతికత రంగంలో తెలుగు ప్రాధాన్యతను గుర్తించేలా జేయడం |
|
| 8 | pracheena Kavitha parichayam | ప్రాచీన తెలుగు కవితా సౌందర్య విశిష్టత ‘హర విలాసం’ గొప్ప తనం.
కొంఢ,నదులను తీసుకుని మానవుల స్వభావం చొప్పించి చెప్పడం దాని విశిష్టత.
సంస్కృత కావ్యాన్ని, దానిలోని కవితా సౌందర్యం తెలుసుకుంటారు. |
|
| 9 | TELUGU & SPL.TELUGU | ||
| 10 | Semester - IIand III sujnatmak Rachna | Course out comes
1. తెలుగు సాహిత్య అభ్యసన నైపుణ్యాలను, సృజనాత్మక నైపుణ్యాలుగా మార్చడం విద్యార్థులు భాషాతత్వాన్ని, భాష యొక్క ఆవశ్యకతను, భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తింపజేయడం మనిషి వ్యక్తిగత జీవనానికి, సామాజిక వ్యవస్థ పటిష్టతకు భాష ప్రధానమని తెలుసుకునేలా జేయడం తెలుగుభాషలోని కీలకాంశాలైన వర్ణం, పదం, వాక్యాల ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవడం
2. అనువాద రంగంలో నైపుణ్య సంపాదనను కలగజేయడం
3. సృజన రంగం, ప్రసార మాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా జేయడం
4. వ్యాస రచన ఎలా చేయాలో నేర్పించడం
5. సాంకేతికత రంగంలో తెలుగు ప్రాధాన్యతను గుర్తించేలా జేయడం Programme Outcomes ఈ కోర్సు విజయవంతంగా ముగించాక, విద్యార్థులు క్రింది అభ్యసన ఫలితాలను పొందగలరు.
1. తెలుగు సాహిత్య అభ్యాసన ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను, సృజనాత్మక నైపుణ్యాలుగా మార్చుకోగలరు. విద్యార్థులు భాషాతత్వాన్ని, భాష యొక్క ఆవశ్యకతను, భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. మనిషి వ్యక్తిగత జీవనానికి, సామాజిక వ్యవస్థ పటిష్టతకు భాష ప్రధానమని తెలుసుకుంటారు. తెలుగుభాషలోని కీలకాంశాలైన వర్ణం, పదం, వాక్యాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ వాగ్రూప, లిఖితరూప వ్యక్తీకరణ ద్వారా భాషానైపుణ్యాలను మెరుగుపరచుకోగలరు.
2. అనువాద ఆవశ్యకతను తెలుసుకుంటారు. అనువాద రంగంలో నైపుణ్యం పెరుగుతుంది.
3. సృజన రంగం, ప్రసార మాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు.
4. భాషానైపుణ్యాలను అలవరచుకోవడంతోపాటు వినియోగించడం నేర్చుకుంటారు. భాషణానైపుణ్యాలను సృజనాత్మక రూపంలో వ్యక్తీకరించగలరు. మంచి వ్యాస రచనా నైపుణ్యాలను పెంపొందించుకోగలరు. 5. సాంకేతికత రంగంలో తెలుగు ప్రాధాన్యత గురించి అవగాహన పొందగలరు.
|